స్టార్ మాలో బిగ్ బాస్ అయిపోయాక.. బిగ్ బాస్ కంటెస్టెంట్ తో ప్రారంభించిన షో 'బిబి జోడి'. అత్యధిక రేటింగ్ తో దూసుకుపోతున్న షోలో జడ్జ్ లుగా సదా, తరుణ్ మాస్టర్, రాధా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. యాంకర్ గా శ్రీముఖి చేస్తోంది.
శనివారం ప్రసారమైన 'బిబి జోడి' షోలో 'అభినయశ్రీ-కౌశల్' జోడికి 'క్యాబ్ రే' ఐటమ్ సాంగ్ థీమ్ ని ఇచ్చారు. అయితే వీరిద్దరు కలిసి చేసిన ఈ సాంగ్ పర్ఫామెన్స్ లో ఐటమ్ గర్ల్ గా అభినయశ్రీ ఓల్డ్ సాంగ్స్ నుండి న్యూ సాంగ్స్ వరకూ అన్నింటికి సరైన హావభావాలను పలికిస్తూ.. ఎక్కడా కూడా తగ్గకుండా ఒదిగి పోయి చేసింది. ఈ డ్యాన్స్ పూర్తయ్యాక పర్ఫామెన్స్ ఎలా ఉందని శ్రీముఖి జడ్జ్ లను అదిగింది. దానికి తరుణ్ మాస్టర్ "మీ అమ్మ కంటే బాగా చేసావ్" అని అంటాడు. రాధ మాట్లాడుతూ "మీ అమ్మ కాకుండా.. ఆ డ్యాన్సర్ గా ఎవరినీ ఒప్పుకోను. కానీ నిన్ను ఒప్పుకుంటా అంటుంది. ఆ తర్వాత జడ్జ్ సదా "మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్" అని చెప్తుంది.
ఆ తర్వాత శ్రీముఖి సర్ ప్రైజ్ అంటూ... అలనాటి డాన్సర్ అభినయశ్రీ తల్లి అయిన అనురాధని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తుంది. అలా వచ్చాక "నేను ఎక్కువ సినిమాలు రాధతో చేశాను. ఇప్పుడు తనని ఇలా చూడటం సంతోషంగా ఉంది" అని అనురాధ అంటుంది. "నా హీరోలని లాక్కోవడమే కదా నీ పని" అని రాధ సరదాగా అంటుంది. ఆ తర్వాత స్టేజి మీద రాధ, అనురాధ, అభినయశ్రీ ముగ్గురు కలిసి డ్యాన్స్ చేశారు. ఇది హైలెట్ ఆఫ్ ది ఎపిసోడ్ గా ఆకట్టుకుంది.
"మా అమ్మ ఒంటరిగా ఎన్నో అవమానాలు భరిస్తూ... నన్ను మా తమ్ముడిని ఇక్కడివరకు తీసుకొచ్చింది" అని అభినయశ్రీ ఎమోషనల్ అయ్యింది.